‘ది ప్యారడైజ్’ కొత్త డేట్.. జడల్ బాక్సాఫీస్ టేకోవర్ చేసేది ఆరోజునే

‘ది ప్యారడైజ్’ కొత్త డేట్.. జడల్ బాక్సాఫీస్ టేకోవర్ చేసేది ఆరోజునే

Published on Feb 12, 2026 5:22 PM IST

The Paradise

నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రమే “ది ప్యారడైజ్”(The Paradise). తన బ్లాక్ బస్టర్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో చేస్తున్న ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా పట్ల భారీ అంచనాలు ప్రస్తుతం నెలకొన్నాయి. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఆల్రెడీ ఈ సినిమా వాయిదాపై ఓ క్లారిటీ ఉంది.

ఈ మార్చ్ 26న విడుదల కావాల్సిన సినిమా ఇంకా పలు పనులు బాకీ ఉండడం మూలాన సినిమా అలా ఆలస్యం అయ్యింది. ఇక కొత్త డేట్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక స్ట్రైకింగ్ పోస్టర్ తో కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. తన జడల్ ఈ ఆగస్ట్ 21 నుంచి బాక్సాఫీస్ టేకోవర్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

సో ఆరోజు వరకు అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ ఆగాల్సిందే. ఈ సినిమాతో నాని భారీ ఓపెనర్ ని బాక్సాఫీస్ దగ్గర సెట్ చేస్తాడనే టాక్ ఉంది. మరి అంతా సెట్ అయితే మాత్రం నాని టైర్ 1 లోకి ఎంటర్ అయ్యినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు