13 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదమే ‘సీతా పయనం’ కథకు స్ఫూర్తి – యాక్షన్ కింగ్ అర్జున్

13 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదమే ‘సీతా పయనం’ కథకు స్ఫూర్తి – యాక్షన్ కింగ్ అర్జున్

Published on Feb 15, 2026 12:07 PM IST

Seetha Payanam Success Meet

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో, శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘సీతా పయనం’. అర్జున్ కుమార్తె ఐశ్వర్య, ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ ఈ సినిమాతో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం ‘థాంక్యూ మీట్’ నిర్వహించింది.

ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. 13 ఏళ్ల క్రితం తాను చూసిన ఓ ప్రమాదం ఆధారంగా ఈ కథను రాసుకున్నానని తెలిపారు. కృతజ్ఞత అనే ఇతివృత్తంతో ఎంతో నిజాయితీగా తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకులు కనెక్ట్ కావడం, ముఖ్యంగా తన కూతురు ఐశ్వర్య నటనకు ప్రశంసలు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ధృవ్ సర్జా ఈ చిత్రంలో పవర్ ఫుల్ అతిథి పాత్ర పోషించారని, ప్రకాష్ రాజ్, సత్యరాజ్ వంటి సీనియర్లు అద్భుతంగా నటించారని వెల్లడించారు.

ప్రేక్షకులు చూపుతున్న ఆదరణ పట్ల హీరో హీరోయిన్లు ఐశ్వర్య, నిరంజన్ ఆనందం వ్యక్తం చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని, ఇది ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు