‘ఆయా షేర్’తో సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న నాని..!

‘ఆయా షేర్’తో సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న నాని..!

Published on Feb 20, 2026 11:30 AM IST

Aaya Sher

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు కానుకగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ విడుదల కానుంది. నాని కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ డ్యాన్స్ నంబర్ అని చిత్ర యూనిట్ పేర్కొంది.

రాక్‌స్టార్ అనిరుధ్ ఈ పాటకు అదిరిపోయే సంగీతాన్ని అందించగా, సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. భారీ సెట్స్, వందలాది మంది డ్యాన్సర్ల మధ్య అత్యంత ఖరీదైన సాంగ్‌గా దీనిని చిత్రీకరించారు. ఈ పాటలో నాని మాస్ స్టెప్పులు అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి.

ఈ గ్రాండ్ విజువల్ స్పెక్టాకిల్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది. నాని డ్యాన్స్ మరియు అనిరుధ్ మ్యూజిక్ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చిలో రాబోయే ఈ మాస్ సాంగ్ థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

తాజా వార్తలు