స్వ్యాసిస్, కింగ్స్ వెల్ భాగస్వామ్యంతో అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ఏర్పాటు

స్వ్యాసిస్, కింగ్స్ వెల్ భాగస్వామ్యంతో అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ఏర్పాటు

Published on Feb 25, 2026 6:00 PM IST

Advance

యువతకు ఉపాధి కల్పన, దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ‘అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌’ (Advance India Initiative) హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ హెచ్‌ఆర్ సంస్థలు స్వ్యాసిస్ (Svyasis), కింగ్స్‌ వెల్‌ (Kingswell) భాగస్వామ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలో నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల పెంపు, నూతన ఆవిష్కరణల ద్వారా స్వావలంబన సాధించడమే తమ ప్రధాన ఉద్దేశమని సంస్థ వ్యవస్థాపకురాలు సురభి తెలిపారు.

వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్న స్వ్యాసిస్, కింగ్స్‌వెల్ సంస్థలకు హెచ్‌ఆర్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఐదు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థలు.. ఇప్పటికే 50 వేల మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. ఇప్పుడు ఈ కొత్త ఇనీషియేటివ్ ద్వారా విద్య, పరిశ్రమల అవసరాల మధ్య సమన్వయం తీసుకువచ్చి లక్షలాది భవిష్యత్తు ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

విదేశీ డిజిటల్ వ్యవస్థల మీద ఆధారపడటాన్ని తగ్గించి, ‘డిజిటల్ సార్వభౌమత్వాన్ని’ సాధించడం ఈ ప్రాజెక్టులో కీలక అంశం. “భారతదేశం అపారమైన అవకాశాల గని. మన యువత అవకాశాల కోసం విదేశాలకు వెళ్లకుండా, ఇక్కడే ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి. భారతీయుల భవిష్యత్తును భారతీయులే తీర్చిదిద్దుకునేలా అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ పనిచేస్తుంది” అని ఈ సందర్భంగా సురభి స్పష్టం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు