పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి లాస్ట్ హిట్ చిత్రం ఓజి తర్వాత రాబోతున్న అవైటెడ్ సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకి ఇంకా నెల మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ సినిమా అంచనాలు ఇపుడు కొంచెం మిక్స్డ్ గానే కనిపిస్తున్నాయి. అభిమానులు కూడా లేటెస్ట్ గా వచ్చిన సొంగ్ తో ఫుల్ హ్యాపీగా కూడా లేమనే చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఈ సినిమాకి లాక్ అయినప్పటికీ షాకింగ్ గా ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం ఈ సినిమాకు బిజినెస్ ఇంకా లాక్ కాలేదు అన్నట్టు తెలుస్తోంది. ఓజి లాంటి హిట్ వచ్చినా సరే ఇంకా నెల మాత్రమే సమయం ఉన్నప్పటికీ ఈ సినిమా బిజినెస్ అక్కడ పూర్తి కానట్టే ఇప్పుడు టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


