ఈ మధ్య కాలంలో చాలానే సినిమాలు భారీ నిడివితో థియేటర్స్ లో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నాయి. కంటెంట్ సరిగ్గా డెలివర్ చేస్తే నిడివితో సంబంధం లేకుండా హిట్ అయ్యిన చిత్రాలు చాలానే ఉన్నాయి. మన తెలుగు నుంచి ఇటీవల పుష్ప 2 చిత్రం ఏకంగా 3 గంటల 40 నిమిషాల రన్ టైం తో వచ్చి పాన్ ఇండియా లెవెల్లో భారీ వసూళ్లు సాధించింది.
ఇప్పుడు అదే సినిమా దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న పెద్ది కూడా ఇపుడు మూడు గంటలకి పైగానే రన్ టైం తో రాబోతున్నట్టు పలు రూమర్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకి ఫుటేజ్ నే 4 గంటలకి పైగా వచ్చిందని ఇందులో రఫ్ గా కట్ చేసినా మూడు గంటలకి పైగా నిడివి వస్తున్నట్టు వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పి ఆర్ వర్గాలు చెబుతున్నాయి. సో పెద్ది విషయంలో అభిమానులు అవేమి నమ్మక్కర్లేదు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


