తమిళ్ లో దర్శకునిగా తన మొదటి సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ తో మంచి హిట్ అందుకున్న యువ దర్శకుడు అభీషన్ జీవిత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే విత్ లవ్. కొత్త దర్శకుడు మదన్ తెరకెక్కించిన ఈ రోమ్ కామ్ ఎంటర్టైనర్ గత నెల వాలెంటైన్స్ డే కానుకగా తమిళ్, తెలుగులో విడుదల అయ్యింది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం అందుకుంది.
ఇలా ఓవరాల్ గా 30 కోట్లకి ఫైగా కలెక్ట్ చేసిన స్ సినిమా ఫైనల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో నేటి నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. సో ఇప్పుడు చూడాలి అనుకునేవారు ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఈ సినిమాలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి


