విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ!

విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ!

Published on Mar 9, 2026 11:20 AM IST

Jana Nayagan

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా హీరోయిన్ పూజా హెగ్డే అలాగే మమితా బైజు కలయికలో దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే జన నాయగన్. ఇదే విజయ్ కి ఆఖరి సినిమా కాగా తెలుగులో జన నాయకుడు పేరిట విడుదలకి సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎపుడో జనవరి లోనే విడుదల కావాల్సి ఉంది కాని సెన్సార్ సమస్యలు ఈ సినిమాని ఆపేసాయి. సరే ఫైనల్ గా ఇప్పుడు సెన్సార్ కావాల్సి ఉండగా మళ్లీ దెబ్బ పడినట్టు తెలుస్తోంది.

రివ్యూ కమిటీ సెన్సార్ యూనిట్ లో ఒకరిది ఆరోగ్యం బాగోని కారణంగా మళ్లీ సెన్సార్ నిలిపివేసినట్టు ఇప్పుడు తెలుస్తోంది. ఇలా విజయ్ ఆఖరి సినిమాకి మాత్రం అనేక అడ్డంకులు ఇంకా కొనసాగుతున్నాయి. మరి ఇవన్నీ దాటుకుని ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు