‘అల్లు అర్జున్ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !

‘అల్లు అర్జున్ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Mar 9, 2026 8:00 PM IST

alluarjun-atlee

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, అల్లు శిరీష్ పెళ్లి కోసం బన్నీ ఈ సినిమా షూట్ కి విరామం ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా కొత్త షెడ్యూల్ కి బన్నీ రెడీ అవుతున్నాడు. అట్లీ కూడా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకూ వరుసగా షూట్ చేయాలని అట్లీ కసరత్తులు చేస్తున్నాడట. అన్నట్టు ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటు మిగిలిన తారాగణం పై కూడా కీలక సీన్స్ ను షూట్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట.

తాజా వార్తలు