మరో యంగ్ డైరెక్టర్‌కు మెగా ఛాన్స్..?

మరో యంగ్ డైరెక్టర్‌కు మెగా ఛాన్స్..?

Published on Mar 12, 2026 1:01 AM IST

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్‌తో జతకడుతూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నాడు. బాబీ కొల్లి, అనిల్ రావిపూడి వంటి వారితో భారీ విజయాలు అందుకున్న ఆయన, ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమాను పూర్తి చేస్తున్నాడు. తాజాగా సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ చెప్పిన ఒక ఇంటెన్స్ విలేజ్ డ్రామాకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ పక్కా పల్లెటూరి మాస్ కథ చిరంజీవికి బాగా నచ్చిందని.. ఇది రామ్ చరణ్ ‘రంగస్థలం’ కంటే పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఇప్పటికే బాబీ మరియు శ్రీకాంత్ ఓదెల చిత్రాలతో ఆయన డైరీ 2028 వరకు ఫుల్ అయిపోయింది. చిన్న సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకున్న చిరంజీవి, వచ్చే నెల నుంచి తిరిగి షూటింగ్స్‌తో బిజీ కానున్నాడు.

వరుస ప్రాజెక్టులతో మెగాస్టార్ చూపిస్తున్న ఈ స్పీడ్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. 2027 సంక్రాంతి లేదా సమ్మర్ నాటికి బాబీ సినిమా, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల మూవీ వరుసగా సందడి చేయనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు