పాపులర్ ఓటీటీ లోకి వచ్చేసిన ‘ఫంకీ’..ఇక్కడైనా క్లిక్కయ్యేనా?

పాపులర్ ఓటీటీ లోకి వచ్చేసిన ‘ఫంకీ’..ఇక్కడైనా క్లిక్కయ్యేనా?

Published on Mar 13, 2026 12:00 PM IST

Funky

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు అనుదీప్ కే వి తెరకెక్కించిన ఫన్ డ్రామా చిత్రమే “ఫంకీ”. డీసెంట్ బజ్ నడుమే రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా అనుకున్న అంచనాలు అయితే రీచ్ కాలేకపోయింది. ఇలా థియేటర్స్ లో ఒక డిజప్పాయింట్ రన్ తర్వాత ఫైనల్ గా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రాన్ని పాపులర్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఈ సినిమా నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.

మరి ఇక్కడైనా ఆడియెన్స్ లో క్లిక్ అవుతుందా లేదా అనేది చూడాలి. అనుదీప్ గత సినిమా ప్రిన్స్ కూడా థియేటర్స్ తర్వాత ఓటీటీ లోకి వచ్చాక ఓ వర్గం ఆడియెన్స్ ని ఫ్యాన్స్ చేసుకుంది. మరి అలానే ఫంకీ కి కూడా జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ అలాగే శ్రీకార స్టూడియోస్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు