ఎం జి ఆర్ పై కాంట్రవర్సీ కామెంట్స్ పై నట కిరీటి క్షమాపణ!

ఎం జి ఆర్ పై కాంట్రవర్సీ కామెంట్స్ పై నట కిరీటి క్షమాపణ!

Published on Mar 13, 2026 3:06 PM IST

Rajendra Prasad

మన టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఈ మధ్య కాలంలో పలు కాంట్రవర్సీ లలో కూడా కనిపిస్తున్నారు. తాజాగా తమిళ దిగ్గజ నటుడు ఎం జి ఆర్ పై ఓ సినిమా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి దారి తీశాయి. తెలుగు సినిమా నటుడు కాంతారావు గారి హయాంలో ఎం జి ఆర్ పరిస్థితిపై పలు షాకింగ్ కామెంట్స్ చేయడం కోలీవుడ్ ఆడియెన్స్ ని హర్ట్ చేసింది.

దీనితో విశాల్, నాజర్ లాంటి నటులు కూడా రాజేంద్రప్రసాద్ కామెంట్స్ ని ఖండించారు. ఇక ఈ వివాదంపై రాజేంద్రప్రసాద్ లేటెస్ట్ గా ఓ వీడియో విడుదల చేసి తను ఎం జి ఆర్ పై చేసిన కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నాను అని అలాగే ఇక ముందు కూడా ఆచితూచి వ్యవహరిస్తాను అని క్షమాపణలు కోరారు. దీనితో తన లేటెస్ట్ క్లారిటీ వైరల్ గా మారింది. వీటితో ఈ వివాదానికి తెరపడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు