Varanasi: ఈ విషయంలో ‘వారణాసి’కి ఓ మెట్టు పైనే ‘రామాయణ’

Varanasi: ఈ విషయంలో ‘వారణాసి’కి ఓ మెట్టు పైనే ‘రామాయణ’

Published on Mar 14, 2026 9:00 AM IST

Varanasi Ramayana

ఇప్పుడు భారతీయ సినిమా నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమాలు పూర్తిగా ఐమ్యాక్స్ వెర్షన్ లలో తెరకెక్కుతున్న సినిమాలు రామాయణ అలాగే వారణాసి అనే చెప్పాలి. రెండూ అత్యున్నత ప్రమాణ విలువలతో తెరకెక్కిస్తుండగా ఈ రెండు సినిమాల నుంచి ఇప్పుడు వరకు పెద్దగా తెరకెక్కించిన ఫుటేజ్ బయటకి రాలేదు.

వారణాసి నుంచి ఒక మోషన్ టీజర్, రామాయణ నుంచి కూడా అలాంటి అనౌన్సమెంట్ టీజర్ నే వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ కి ఒక పీక్ విజువల్ మరియు ఆడియో ఎక్స్ పీరియెన్స్ ని అందించాలనే నెపంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

అయితే గ్లోబల్ రీచ్ పరంగా వారణాసి ఓ మెట్టు మీదనే ఉంది కానీ రామాయణ మాత్రం వారణాసి కంటే మరో అంశంలో ఓ మెట్టు ఎక్కువ ఉందని చెప్పొచ్చు. పలు నోటెడ్ థియేటర్స్ లో లేటెస్ట్ గా డాల్బీ సినిమాస్ లో కూడా రెండు టీజర్ లు ప్రదర్శితం అయ్యాయి. అయితే వీటిలో విజువల్ పరంగా రామాయణ ఇచ్చిన ఎక్స్ పీరియెన్స్ వేరే అని అంతా మాట్లాడుకుంటున్నారు.

ఇక్కడ రామాయణ కి ప్లస్ ఏమైంది అంటే దీనిని 3డి లో ప్లాన్ చేయడం. ఇది కూడా వారణాసి లానే 3డి ఫార్మాట్ లేకుండా వదిలి ఉంటే టాక్ వేరేలా ఉండేది ఏమో కానీ కేవలం ఈ సినిమా మోషన్ టీజర్ ని 3డి లో చూసినవారు మాత్రం రామాయణ కోసం మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. సో ఈ విషయంలో మాత్రం వారణాసి కంటే రామాయణ ఓ మార్క్ ఎక్కువే పొందింది. మరి జక్కన్న తన వారణాసి ని కూడా 3డి లో అనౌన్స్ చేస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు