కమల్ పై తీవ్ర విమర్శలు చేసిన సింగర్ చిన్మయి !

కమల్ పై తీవ్ర విమర్శలు చేసిన సింగర్ చిన్మయి !

Published on Mar 15, 2026 7:33 PM IST

Chinmayi

తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుకి భారతదేశంలో అత్యున్నత సాహితీ పురష్కారమైన ‘జ్ఞానపీఠ్‌ అవార్డ్’ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే, జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన వైరముత్తుకు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. జయకాంతన్ గారు జ్ఞానపీఠ్ అందుకున్న తర్వాత, ఇన్నేళ్లకు తమిళానికి ఈ గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన నా ప్రియ మిత్రుడు కవిపేరరసు వైరముత్తుకి శుభాకాంక్షలు’ అంటూ కమల్ పోస్ట్ చేశారు.

పైగా తన పోస్ట్ లో “ఆకాశం నాకు ఒక బోధి వృక్షం వంటిది.. అది ప్రతిరోజూ నాకు ఒక సందేశాన్ని మోసుకొస్తుంది” అనే కవితా పంక్తులను జోడించారు. ఐతే, ఈ పోస్ట్ ను చూసిన సింగర్ చిన్మయి, కమల్‌ హాసన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ పోస్ట్ పెట్టింది. ‘ఈ వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో గొప్ప వ్యక్తిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. అంకుల్(వైరముత్తు) లైంగికంగా వేధించాడని చెప్పినా, ఈ వ్యక్తి వినిపించుకోవడం లేదు. ఇతను మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తుంచుకోవాలి’ అంటూ చిన్మయి కమల్ పై నెగిటివ్ గా రాసుకొచ్చింది. గతంలో ‘మీటూ’, కాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో వైరముత్తుపై చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు