మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన కెరీర్ 158వ భారీ సినిమా కూడా ఒకటి. తనకి వాల్తేరు వీరయ్య అనే సెన్సేషనల్ హిట్ ఇచ్చిన తన ఫ్యాన్ దర్శకుడు బాబీ కొల్లితో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై కూడా సాలిడ్ బజ్ ఉంది. ఇక షూటింగ్ ఇంకా మొదలు పెట్టుకోవాల్సి ఉన్న ఈ సినిమా కోసం రీసెంట్ గా కొన్ని రూమర్స్ మొదలయ్యాయి.
ఈ సినిమా నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో ఈ సినిమా ఆగింది అంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే అసలు ఇందులో ఎలాంటి నిజం లేదని మేకర్స్ చెబుతున్నారు. తమ నుంచి అన్ని సినిమాలూ ఆన్ ట్రాక్ లో ఉన్నాయని, అలానే మెగాస్టార్, బాబీ సినిమా కూడా మొదలవుతుంది అని చెబుతున్నారు. సో చిరు, బాబీ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తాడని టాక్ ఉంది. మరి షూట్ ఎప్పుడు నుంచి మొదలవుతుందో చూడాలి.


