థమన్ పై హరీష్ పొగడ్తల వర్షం.. టాప్ లేపాడట..!

థమన్ పై హరీష్ పొగడ్తల వర్షం.. టాప్ లేపాడట..!

Published on Mar 17, 2026 9:00 AM IST

Thamna

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు కేవలం రెండు రోజులే సమయం ఉండటంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చాడు. సంగీత దర్శకుడు థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను పూర్తి చేశారని, ఆయన పడ్డ శ్రమను ‘హెర్క్యులియన్ ఎఫర్ట్’ అని హరీష్ ప్రశంసించాడు.

ఫైనల్ అవుట్‌పుట్ చూశాక తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మరోవైపు, ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో మొదలై, అన్ని ప్రాంతాల్లో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి.

​మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తుండగా, పార్థిబన్, గౌతమి, కేఎస్ రవికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు అందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్, పవర్ స్టార్ మేనరిజమ్స్ మరియు హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది.

తాజా వార్తలు