Dhurandhar 2 box office prediction: టికెట్ల కోసం ఎగబడుతున్న జనం.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రణ్‌వీర్ సింగ్!

Dhurandhar 2 box office prediction: టికెట్ల కోసం ఎగబడుతున్న జనం.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రణ్‌వీర్ సింగ్!

Published on Mar 17, 2026 6:00 PM IST

Dhurandhar 2

బాక్సాఫీస్ దగ్గర రణ్‌వీర్ సింగ్ విశ్వరూపం చూపించడానికి మళ్లీ సిద్ధమయ్యాడు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎల్లుండి (మార్చి 19న) ఈ సినిమా ఏకకాలంలో ఐదు భాషల్లో భారీ స్థాయిలో థియేటర్లలోకి వస్తుండగా.. రేపు సాయంత్రం నుంచే ఓవర్సీస్‌తో పాటు ఇండియాలో స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ పడబోతున్నాయి.

రిలీజ్‌కు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ వల్ల మార్చి 19 (రిలీజ్ రోజు) తెల్లవారుజామున పడే డే 1 షోలను ముంబై లాంటి నగరాల్లో అర్ధరాత్రి 2 గంటలకే ప్రారంభించేందుకు థియేటర్ యాజమాన్యాలు ప్లాన్ చేస్తున్నాయి. ఇక కలెక్షన్ల లెక్కల విషయానికొస్తే.. ట్రేడ్ వర్గాల లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) అడ్వాన్స్ బుకింగ్స్ ఊహకందని స్థాయిలో ఉన్నాయి. వీకెండ్ మొత్తానికి కలుపుకుని ఇప్పటికే 15 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం రేపు పడబోయే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే అక్షరాలా రూ.37.11 కోట్లు రాబట్టగా, మార్చి 19న పడే మొదటి రోజు షోలకు రూ.22.70 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ రెండు కలుపుకుంటే రిలీజ్‌కు ముందే సుమారు రూ.60 కోట్ల కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు నార్త్ అమెరికాలో ఏకంగా 4 మిలియన్ డాలర్ల (ఓపెనింగ్ వీకెండ్) ప్రీ-సేల్స్ నమోదు చేసి షారుఖ్ ఖాన్, ప్రభాస్ సినిమాల ఓవర్సీస్ రికార్డులకు గట్టి పోటీ ఇస్తోంది.

అసలు ఈ సినిమాపై ఇంత బజ్ రావడానికి కారణం ‘ధురంధర్’ (2025) మొదటి భాగం క్రియేట్ చేసిన ఇంపాక్ట్. పాకిస్థాన్‌లో అండర్‌కవర్ ఆపరేషన్ చేసే భారతీయ ఏజెంట్ ‘జస్కిరత్ సింగ్ రంగీ’ గా రణ్‌వీర్ నటన అందరినీ కట్టిపడేసింది. ఆ సినిమా ఏకంగా రూ.1300 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సీక్వెల్‌లో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ లాంటి భారీ తారాగణం ఉండటం అంచనాలను మరింత పెంచేసింది.

సుమారు 3 గంటల 50 నిమిషాల నిడివితో వస్తున్న ఈ యాక్షన్ ఎపిక్.. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టడం గ్యారెంటీ అని ఇన్‌సైడ్ టాక్. అంచనాలకు తగ్గట్టే రేపు ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అండర్‌కవర్ ఏజెంట్‌గా రణ్‌వీర్ సింగ్ రివెంజ్ డ్రామా థియేటర్లలో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు