ఈ ఉగాది, ఈద్ పండుగల కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన పలు అవైటెడ్ సినిమాల్లో బాలీవుడ్ క్రేజీ సీక్వెల్ చిత్రం ధురంధర్ ది రివెంజ్ కూడా ఒకటి. దర్శకుడు ఆదిత్య ధర్ అలాగే హీరో రణ్వీర్ సింగ్ కలయికలో వచ్చిన ఈ సాలిడ్ సినిమా గ్రాండ్ గా నిన్న ప్రీమియర్స్ తో మొదలైంది. ఇక ఈ సినిమాకి కూడా ఫస్ట్ పార్ట్ లానే సాలిడ్ టాక్ పడిపోయింది. మరి లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధురంధర్ 2 చూశాక తన రెస్పాన్స్ పంచుకోకుండా ఉండలేకపోయాడు.
పుష్ప రాజ్ కి ఈ సినిమా అమితంగా నచ్చేసింది అట. నటుడు మాధవన్, నా బ్రదర్ రణ్వీర్ సింగ్ లు పెర్ఫార్మన్స్ లు పీక్ అంటూ ఆకాశానికి ఎత్తేసాడు. అలాగే దర్శకుడు ఆదిత్య ధర్ మన ఇండియన్ సినిమా దగ్గరే ఒక అద్భుతమైన దర్శకుడు అని, ఇదొక భారతీయ కథ, ఇంటర్నేషనల్ స్వాగ్ అంటూ ఐకాన్ స్టార్ ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తూ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది.
Just Watched #Dhurandhar2⁰Patriotism with swag 🇮🇳
A film that will make every patriot proud 🇮🇳⁰Many clap-trapping moments 👏🏽
BLAST! 💥
Congratulations to the entire team.⁰Fine performances by @ActorMadhavan garu & all actors . Technical brilliance .So proud to have a…
— Allu Arjun (@alluarjun) March 18, 2026


