ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 ఓటీటీ, శాటిలైట్ పార్ట్నర్ డీటెయిల్స్!

ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 ఓటీటీ, శాటిలైట్ పార్ట్నర్ డీటెయిల్స్!

Published on Mar 19, 2026 8:01 AM IST

Dhurandhar2-UBS

ఈ ఉగాది బరిలో తెలుగు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మరియు నటుడు రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన భారీ సీక్వెల్ చిత్రం ధురంధర్ పార్ట్ 2 కూడా ఒకటి. ఎంతో గ్రాండ్ గా విడుదలకి వచ్చిన ఈ సినిమాల తాలూకా ఓటీటీ, శాటిలైట్ హక్కుల డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 1 రెండు సినిమాల ఓటీటీ హక్కులూ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నే సొంతం చేసుకున్నారు.

మొదట ఉస్తాద్ భగత్ సింగ్ ని అమెజాన్ తీసుకున్నారు. కానీ తర్వాత మళ్లీ కంటెంట్ చూసి నెట్ ఫ్లిక్స్ మరింత ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసారు. అలాగే ఈ సినిమా శాటిలైట్ డీల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. మేకర్స్ ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంచారట. ఇక ధురంధర్ 2 మాత్రం ని అయితే డిస్నీ హాట్ స్టార్ టీవీ సంస్థ సొంతం చేసుకున్నారు. అలాగే శాటిలైట్ హక్కులు కూడా వీరి అనుబంధ సంస్థ స్టార్ టీవీ వారు సొంతం చేసుకున్నారు. తెలుగు వెర్షన్ అయితే స్టార్ మా లో ప్రసారం అవుతుంది. సో ఈ రెండు అవైటెడ్ సినిమాల తాలూకా ఓటీటీ, శాటిలైట్ వివరాలు అయితే ఇవి.

తాజా వార్తలు