‘ఉస్తాద్’ ఓపెనింగ్స్ పైనే అందరి కళ్ళు!

‘ఉస్తాద్’ ఓపెనింగ్స్ పైనే అందరి కళ్ళు!

Published on Mar 20, 2026 7:00 AM IST

Ustaad Bhagat Singh Review

ఓజి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. ఎన్నో అంచనాలు కొన్ని ఒడిదుడుకులు నడుమ థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ స్టామినాకి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ పై ప్రభావం చూపించింది. సాలిడ్ బుకింగ్స్ తో డే 1కి రెండు తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా థియేటర్స్ కళకళలాడుతూ కనిపించాయి.

ఇక ఇలాంటి రెస్పాన్స్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి రోజు ఓపెనింగ్స్ పైనే అందరి కళ్ళు పడ్డాయి. డే 1 సాలిడ్ బుకింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓజి తరహాలో 100 కోట్లకి పైగా ఓపెనింగ్స్ సాధించకపోయినా మినిమం గ్యారెంటీ నెంబర్ అయితే సెట్ చేస్తుంది అని అభిమానులు భావిస్తున్నారు. అలాగే ట్రేడ్ వర్గాల్లో కూడా ఉస్తాద్ ఓపెనింగ్స్ భారీ గానే ఉంటాయని చెబుతున్నారు. సో మేకర్స్ అఫీషియల్ నెంబర్ ఏమన్నా ప్రకటిస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు