‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘తురుమ్ ఖాన్ లు’

‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘తురుమ్ ఖాన్ లు’

Published on Mar 24, 2026 6:00 AM IST

2 3

స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెలంగాణ పల్లెటూరి వాతావరణం, యాస నేపథ్యంలో తెరకెక్కిన పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ ‘తురుమ్ ఖాన్ లు’. థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది.

కరోనా లాక్‌డౌన్ సమయంలో తుపాకులగూడెం గ్రామంలో జరిగే మూడు భిన్నమైన ప్రేమకథల సమాహారమే ఈ సినిమా. మరదలు లలితను పెళ్లి చేసుకోవాలనుకునే యూత్ లీడర్ శంకర్, విడిపోయిన ప్రేయసి పద్మను కలవాలనుకునే విష్ణు, మరోవైపు భారతితో ఎఫైర్ పెట్టుకోవాలనుకునే బ్రహ్మ.. ఈ పాత్రల చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఎన్. శివ కల్యాణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సహజమైన పల్లెటూరి హాస్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.

నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశ్వర్య, పులి సీతా తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా దేవరాజ్ డైలాగ్ డెలివరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొత్తవారిని ప్రోత్సహిస్తూ ఈ సినిమాను నిర్మించిన నిర్మాత ఎండీ అసిఫ్ జానీకి పరిశ్రమ నుంచి మంచి గుర్తింపు దక్కింది. ఓటీటీలో వస్తున్న అద్భుతమైన స్పందన పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ, త్వరలోనే మరో కొత్త చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు