మాఫియా నేపథ్యంలో మెగాస్టార్ పాత్ర ?

మాఫియా నేపథ్యంలో మెగాస్టార్ పాత్ర ?

Published on Mar 29, 2026 5:58 PM IST

Chiru-Boby

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ను డిజైన్ చేశారని.. ఈ ఫ్లాష్ బ్యాక్ లో భారీ మాస్ సీక్వెన్సెస్ ఉంటాయని.. అందుకు తగ్గట్టు.. చిరు పాత్ర పై చుట్టూ ఓ బలమైన డ్రామాను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. అన్నట్టు ఈ ఫ్లాష్ బ్యాక్ లో మెగాస్టార్ పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట.

మొత్తానికి ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది.

తాజా వార్తలు