బాలయ్య బాబు – గోపీచంద్ మలినేని కలయికలో రాబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో డింపుల్ హయాతి నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. ఈ సినిమాలో డింపుల్ హయాతి ఉందని తాము చెప్పలేదని, ఈ సంగతి తమకే తెలియదన్నట్లు గోపీచంద్ మలినేని క్లారిటీ ఇచ్చారు. ”మీకేమన్నా చెప్పారా?.. నాకు ఎవరూ చెప్పలేదండీ” అంటూ ఆయన స్ఫష్టం చేశారు.
ఇక ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బాలయ్యను ఒక రాజుగా చూపించారు. అలాగే, నయనతారని ఒక మహారాణి పాత్రలో కనిపించనుందని చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో చూడాలి. అన్నట్టు గతంలో బాలయ్య – నయన్ కలిసి ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కాగా సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.


