‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Mar 30, 2026 1:52 PM IST

sss 1 1

నటుడు శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివాజీ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమా జనంలోకి వెళ్లడంతో సినిమా పై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఐతే, థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఐతే, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కాబోతుంది.

మరి ఓటీటీలో ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. శ్రీరామ్‌ (శివాజీ) నిజాయతీపరుడైన పంచాయతీ కార్యదర్శి. కొత్తకోట సమీపంలోని హార్స్‌లీహిల్స్‌లో భార్య ఉత్తర (లయ), కొడుకు బిట్టు అలియాస్‌ నితిన్‌ (రోహన్‌)తో కలిసి జీవిస్తుంటాడు. ఓ దీపావళి రోజున వాళ్ల ఇంటికి ఆ ఊరి ఎస్సై విక్రమ్‌ వాసుదేవ్‌ (ప్రిన్స్‌) వస్తాడు. అనూహ్యంగా శ్రీరామ్‌ కొడుకు చేతిలో ఆ ఎస్సై హత్యకు గురవుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది.

తాజా వార్తలు