స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో ఆమె మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతుండగా, జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకలను ఆకట్టుకుంది. కాగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం అద్భుతమైన విజువల్స్ మరియు మిస్టరీ ఎలిమెంట్స్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచింది.
దర్శకుడు రోజిన్ థామస్ ఈ చిత్రాన్ని ఒక ఫాంటసీ ఎంటర్టైనర్‌గా, గ్రాండ్ విజువల్ స్పెక్టాకిల్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఒక మాంత్రికుడి జీవితం చుట్టూ తిరిగే ఈ కథను శ్రీ గోకులం మూవీస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. వినీత్, సందీప్, దేవిక, హరీష్ ఉత్తమన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సుబ్రమణియన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఈ భారీ విజువల్ వండర్ కోసం అనుష్క అభిమానులు మరియు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


