‘స్వయంభూ’ కూడా సమయం తీసుకుంటోంది.. రిలీజ్ డేట్ మారేనా..?

‘స్వయంభూ’ కూడా సమయం తీసుకుంటోంది.. రిలీజ్ డేట్ మారేనా..?

Published on Apr 10, 2026 10:00 AM IST

Swayambhu

హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా ‘స్వయంభూ’ విడుదల మరోసారి వాయిదా పడనుంది. తొలుత ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో సినిమాను వేసవి కాలానికి మార్చారు. చిత్ర బృందం ఏప్రిల్ 30ని ఒక ఆప్షన్‌గా పరిశీలించినా, టెక్నికల్ పనుల కారణంగా అది సాధ్యపడట్లేదు.

​ఈ వరుస వాయిదాలకు ప్రధాన కారణం సినిమాలో ఉన్న భారీ VFX పనులే. ఒక పీరియడ్ సినిమా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని నిఖిల్ మరియు చిత్ర యూనిట్ భావిస్తున్నారు. అందుకే తొందరపడి సినిమాను విడుదల చేయకుండా, అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చే వరకు సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

​ప్రస్తుత సమాచారం ప్రకారం, మే నెల చివరి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. పాన్-ఇండియా స్థాయిలో అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యాక ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ఉండనున్నాయి.

తాజా వార్తలు