అనసూయ వర్సెస్ శివాజీ: ఇంకా ఆరని మంట..

అనసూయ వర్సెస్ శివాజీ: ఇంకా ఆరని మంట..

Published on Apr 11, 2026 11:00 PM IST

Anasuya-bharadwaj-and-shiva

కొన్నాళ్ల కితం నటుడు శివాజీ పలువురు హీరోయిన్/నటీమణులు వస్త్రాలంకరణ విషయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎలాంటి వివాదానికి దారి తీసాయో అందరికీ తెలిసిందే. అయితే చాలామంది శివాజీ ఇంటెన్షన్ కరెక్ట్ కావచ్చు కానీ చెప్పిన సమయంలో వాడిన మాటలు కరెక్ట్ కాదని అన్నారు. అలాగే మరికొందరు ఇతర సినీ నటులు మా బాడీ మా ఇష్టం మాకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ మాకు ఉందని శివాజీకి రివర్స్ కౌంటర్లు కూడా ఇచ్చారు. మరి వారిలో యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు.

ఆ కాంట్రవర్సీ తర్వాత ఏ హీరోయిన్ లేదా నటి నిండుగా వస్త్రాలంకరణ చేసుకొని కనిపించినా చాలామంది అది శివాజీ ఎఫెక్ట్ వల్లే అని చెప్తూ వచ్చారు. అలానే తాజాగా అనసూయపై కూడా అదే తరహా పోస్టు లు పడగా దానికి అనసూయ శివాజీ పేరిట సెటైరికల్ పోస్ట్ చేసారు. అదేంటి శివాజీ సృష్టించిన చీర అనే వస్త్రాన్ని ధరించి తిరుగుతున్న అనసూయ అని రాయాలి కదా అంటూ వ్యంగ్యంగా బదులివ్వడంతో వీరి నడుమ కోల్డ్ వార్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది అనిపిస్తుంది. మరి దీనిపై మళ్లీ శివాజీ నుంచి ఏమైనా రియాక్షన్ ఉంటుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు