రుక్మిణి వసంత్ తప్పుకుంటే, ధురంధర్ భామ వచ్చేనా..?

రుక్మిణి వసంత్ తప్పుకుంటే, ధురంధర్ భామ వచ్చేనా..?

Published on Apr 17, 2026 1:01 AM IST

dhanush

తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన ‘కర’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ‘డీ 56’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాలో ధనుష్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయంలో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

మొదట ఈ ప్రాజెక్ట్ కోసం కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు వినిపించింది. అయితే, ఆమె ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేక ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో చిత్ర బృందం ఇప్పుడు మరో కొత్త హీరోయిన్ కోసం వెతకడం మొదలుపెట్టారు.

తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ యువ నటి సారా అర్జున్‌ను ఈ పాత్ర కోసం ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ధురంధర్ చిత్రంతో నేషనల్ స్థాయిలో మంచి బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తమిళంలో నటించే ఛాన్స్ అందుకుంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తాజా వార్తలు