కేవలం 3 వారాలు.. 2 ఓటిటిల్లోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు థ్రిల్లర్!

కేవలం 3 వారాలు.. 2 ఓటిటిల్లోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు థ్రిల్లర్!

Published on Apr 17, 2026 10:09 AM IST

ఒక్క సంక్రాంతి సీజన్ పక్కన పెడితే అక్కడ నుంచి తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు వరకు మళ్ళీ డల్ గానే సాగింది అని చెప్పాలి. మధ్యలో ఏవో ఒకటీ రెండు సినిమాలు పక్కన పెడితే ఏ ఇతర సినిమాలు కూడా ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయాయి. ఈ క్రమంలో ఓ సినిమా కేవలం మూడు వారాల్లోనే ఇప్పుడు థియేటర్స్ నుంచి ఓటిటికి వచ్చేసింది.

యువ హీరో ప్రియదర్శి హీరోగా వై ఎస్ మాధవ్ రెడ్డి తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం “సుయోధన” గత మార్చ్ 27న థియేటర్స్ లో విడుదల అయ్యింది. కానీ ఈ సినిమా అంతగా రాణించలేదు. ఇక ఈ మూడు వారాల్లోనే సినిమా రెండు ఓటిటి ప్లాట్ ఫామ్ లలోకి వచ్చేసింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ్టి నుంచి ఈ సినిమా ప్రస్తుతం ఒరిజినల్ తెలుగు అలాగే డబ్బింగ్ తమిళ్ వెర్షన్ లలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనితో పాటుగా మరో పాపులర్ ఓటిటి జియో హాట్ స్టార్ లో మొత్తం 5 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సో ఈ సినిమా చూడాలి అనుకునేవారు చూడొచ్చు. ఇక ఈ సినిమా దృషికా చందర్ హీరోయిన్ గా నటించగా బోసుబాబు నిడుమోలు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు