గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ‘వీరసింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. NBK111 వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ యాక్షన్ డ్రామా తాజాగా సెట్స్ పైకి వెళ్లినట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే నయనతార పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు సమాచారం. గతంలో బాలయ్యతో కలిసి ‘భగవంత్ కేసరి’లో నటించిన కాజల్, మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.
వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, హీరోయిన్ల విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


