సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఈ హీరోయిన్ కి బిగ్ రిలీఫ్!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఈ హీరోయిన్ కి బిగ్ రిలీఫ్!

Published on Apr 26, 2026 8:00 PM IST

బాలీవుడ్ సినిమా దగ్గర తన కొన్ని సినిమాలతోనే సత్తా చాటి చిన్న వయసులోనే మరణించిన టాలెంటెడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగానే తెలుసు. ఎం ఎస్ ధోని జీవిత చరిత్రని బయోపిక్ గా చేసిన ఈ యంగ్ హీరో 2020 కరోనా లాక్ డౌన్ సమయంలో అనుమానాస్పదంగా మరణించడం అందరినీ తీవ్రంగా కలచి వేసింది.

అయితే తనది ఆత్మహత్యే అని సిబిఐ కోర్ట్ నివేధిక అందించింది కానీ అప్పట్లో తన గర్ల్ ఫ్రెండ్ ప్రముఖ హీరోయిన్ రెయా చక్రబోర్తి పేరు బాగా వినిపించింది. అయితే అప్పటి నుంచి ఆమె బ్యాంకు ఖాతా అలాగే ఆమె సోదరుడు బ్యాంకు ఖాతాలని ఎన్ సి బి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) వారు ఫ్రీజ్ చేసేసారు. అయితే ఈ విషయంలో వారికి ఎన్ డీ పి సి కోర్ట్ వారు ఉపశమనం అందించారు. ఆమె బ్యాంక్ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ విషయంలో దర్యాప్తు సంస్థ తప్పనిసరిగా పాటించాల్సిన చట్టపరమైన విధివిధానాలను అనుసరించడంలో విఫలమైందని కోర్టు పేర్కొంది. ఇలా మొత్తానికి యువ హీరోయిన్ కి బిగ్ రిలీఫ్ దక్కింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు