నిన్న బ్యాన్, ఇప్పుడు పూజలు.. ‘ధురంధర్’ హీరోకి ఏమైంది!

నిన్న బ్యాన్, ఇప్పుడు పూజలు.. ‘ధురంధర్’ హీరోకి ఏమైంది!

Published on May 26, 2026 10:24 PM IST

బాలీవుడ్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాలని భారీ గ్రాసర్ చిత్రాల్ని తన పేరు మీద రాసుకున్న టాలెంటెడ్ హీరోనే రణ్వీర్ సింగ్. ధురంధర్ పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 లతో ఏకంగా 3000 కోట్లకి పైగా గ్రాస్ ని తాను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాడు. అయితే ఇంత సెన్సేషన్ సెట్ చేసిన రణ్వీర్ సింగ్ పై షాకింగ్ వార్తలు ఊహించని విధంగా ఇప్పుడు చర్చకు దారి తీశాయి.

తాను డాన్ 3 సినిమా విషయంలో చూపిన వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేస్తూ మూడేళ్ళు అతన్ని బాలీవుడ్ నుంచి బ్యాన్ చెయ్యాలని చెప్పడం షాకింగ్ గా మారింది. అయితే దీని తర్వాత సడెన్ గా రణ్వీర్ సింగ్ కొన్ని పూజలు చేస్తూ కర్ణాటకలోని చాముండేశ్వరి అమ్మవారు ఆలయంలో కనిపించడం మరింత ఆసక్తిగా మారింది. అయితే దీని వెనుక మరో కారణం ఉంది.

కొన్నాళ్ల కితం కాంతార నటుడు రిషబ్ శెట్టి విషయంలో చేసిన అనుచిత ప్రవర్తన రణ్వీర్ ని వివాదాల్లోకి లాక్కెళ్ళింది. దీనితో తనపై కేసు నమోదు కావడం కర్ణాటక న్యాయస్థానం మందలించడం మైసూరు చాముండేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించాలని సూచించడంతో రణ్వీర్ సింగ్ ఇక్కడ దర్శనమిచ్చాడు. దీనితో నిన్న ఆ షాకింగ్ న్యూస్ తర్వాత రణ్వీర్ ఇలా కనిపించడం మరోసారి వైరల్ గా మారింది.

తాజా వార్తలు