విజయ్ స్టైల్ లో ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడా?

విజయ్ స్టైల్ లో ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడా?

Published on Jul 14, 2026 11:20 AM IST

మన దక్షిణాది సినిమా దగ్గర మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో సినీ ప్రముఖులు పాలిటిక్స్ లోకి రావడం అనేది తరచూ జరిగే ప్రక్రియే.. అలా లేటెస్ట్ గా ఇళయ దళపతి విజయ్ తన పొలిటికల్ పార్టీ పెట్టి మొదటి అటెంప్ట్ లోనే భారీ సక్సెస్ అయ్యి సీఎం అయ్యాడు. అయితే విజయ్ పక్కా ప్లానింగ్ తో కుంభస్థలాన్ని బద్దలు కొట్టాడని ఎవరో కాదు మన తెలుగు ఆడియెన్సే అంటారు.

కరెక్ట్ టీంతో సరైన సినిమాలు ప్లాన్ చేసుకొని మార్కెట్, ఫాలోయింగ్ అమాంతం పెంచుకొని పాలిటిక్స్ లోకి దిగి విజయ్ ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఇదే స్టైల్ ని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఫాలో అవుతున్నాడా అనే టాక్ చిన్నగా ఇపుడు మొదలైంది.

నిజానికి తారక్ ప్రస్తుతానికి రాజకీయాల్లో వచ్చే ఆలోచనలో లేనని ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. కానీ అందుకు బేస్మెంట్ ఇప్పుడు నుంచి మొదలు పెడుతున్నాడా అనే టాక్ మొదలైంది. ఓ పక్క భారీ సినిమాల లైనప్ లుతో తారక్ ఫుల్ ఫామ్ లో ఉండడం మరోపక్క పార్లల్ గా గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం సినీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో ఈ జూలై 18న తారక్ ప్రెస్ మీట్ కోసమే చర్చ నడుస్తుంది.

అయితే తారక్ ఫ్యాన్ బృందం అది ఎన్టీఆర్ పొలిటికల్ మీట్ అనే వార్తలను ఖండించారు. కానీ ప్రస్తుతానికి అయితే నడుస్తున్న ఊహాగానాలకు మాత్రం సమాధానం లేదు. ఇలా నెమ్మదిగా తారక్ తన సెపరేట్ మార్క్ ని ఏపీలో సెటప్ లో చేసుకుంటున్నాడా అనేది ప్రథమ చర్చనీయంశంగా మారింది. సో తారక్ రాజకీయ రంగ ప్రవేశం పై క్లారిటీ కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు