ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి అత్యంత ప్రెతిష్ఠాత్మకంగా వస్తున్న అవైటెడ్ భారీ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వారణాసి కూడా ఒకటి. అయితే ఈ చిత్రంని గ్లోబల్ లెవెల్లో ప్రెజెంట్ చేస్తూ మేకర్స్ ఇప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ లు ఇస్తూ వస్తున్నారు.
ఇలా లేటెస్ట్ గా ఈ తెల్లవారు జాముతోనే క్రేజీ సర్ప్రైజ్ ఇపుడు వైరల్ గా మారింది. డైరెక్ట్ గా వారణాసి సినిమా నుంచి హీరోయిన్ ప్రియాంక చోప్రా తాలూకా సరికొత్త లుక్ పోస్టర్స్ రెండు ఇంటర్నేషనల్ మీడియాకి వదిలారు. దీనితో ఈ పోస్టర్స్ వైరల్ గా మారిపోయాయి.
ఒకదానిలో మంచి గ్లామరస్ గా ఆమె కనిపిస్తే మరో పోస్టర్ లో చిల్ మోడ్ లో ఆమె కనిపిస్తుంది. దీనితో ఈ సడెన్ సర్ప్రైజ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. ఇక ఈ చిత్రంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే కే ఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ నిర్మాణం వహిస్తున్నారు.


