సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలి అంటే వరుసగా పది ప్లాపులు వచ్చినా ఒక్క సరైన హిట్ పడితే చాలు అది ఆ హీరో లేదా హీరోయిన్స్ కి కోల్పోయిన తమ ఫామ్ ని మళ్ళీ తీసుకొచ్చేస్తుంది. అయితే ఇది అన్ని సార్లు ఏకకాలంలో జరగకపోవచ్చు కానీ ఈ ఏడాదిలో మాత్రం మన పాపులర్ స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా సాలిడ్ కంబ్యాక్ లు ఇచ్చి స్టార్స్ కి 2027 ఒక కంబ్యాక్ నామ సంవత్సరంగా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మరి ఈ లిస్ట్ మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు తోనే మొదలవుతుంది కానీ 2027 ద్వితీయార్ధంలో మాత్రం మన స్టార్స్ సుడి తిరిగింది. మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి తర్వాత వచ్చిన అనేక సినిమాలతో హీరోలు హీరోయిన్స్ మళ్ళీ తమ మార్కెట్ సొంతం చేసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యారు.
రామ్ చరణ్ ‘పెద్ది’
గత ఏడాది మిగిల్చిన పెద్ద గాయం ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ఒక్క సినిమా ఎక్స్ పీరియన్స్ ఉన్న దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సినిమానే ‘పెద్ది’. ఒక రూరల్, ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో వచ్చి దీని తర్వాత రానున్న సినిమాలకి బాక్సాఫీస్ ఊపిరిని ఇచ్చింది. ఇలా రామ్ చరణ్ మొదట మంచి కంబ్యాక్ తో ఖాతా తెరవడం జరిగింది.
అఖిల్ ‘లెనిన్’
టాలీవుడ్ లో ఎంతో కాలంగా ఒక్క ప్రాపర్ హిట్ తన పేరిట ఉండాలని అభిమానులు గట్టిగా కోరుకున్న హీరోస్ లో అఖిల్ అక్కినేని కూడా ఒకరు. అఖిల్ హీరోగా చేసిన అవైటెడ్ సినిమా ‘లెనిన్’ ఒక బాక్సాఫీస్ సర్ప్రైజ్. దీని తరహాలో అంత ఆలస్యం అవుతూ వచ్చి 100 కోట్ల వసూళ్లు అందుకున్న సినిమాలు తెలుగు సినిమా దగ్గర దాదాపు లేవు. అయినప్పటికీ అలాంటి రేర్ ఫీట్ కొట్టి అఖిల్ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు సహకారంతో దుమ్ము లేపే కంబ్యాక్ ని ఇచ్చాడు.
వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’
మెగా కుటుంబంలో మొదటి నుంచీ ఏదొక వినూత్నత ఎంచుకుంటూ వస్తున్న అరుదైన హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తాను కూడా ఒక్క సరైన హిట్ కోసం చాలా కాలం స్ట్రగుల్ కావాల్సి వచ్చింది. కానీ ఫైనల్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో చేసిన ‘కొరియన్ కనకరాజు’తో ఇదే 2027 లో తన కోరిక తీరింది.
‘మా ఇంటి బంగారం’ సమంత కూడా..
తెలుగు సినిమాకి చాలా కాలం దూరంగా ఉన్నప్పటికీ సమంత ‘మా ఇంటి బంగారం’తో ఇచ్చిన కంబ్యాక్ అనేది ఒక కేస్ స్టడీ అని చెప్పొచ్చు. చాలా యావరేజ్ కంటెంట్ అనే టాక్ వచ్చింది కానీ ఊహించని లాంగ్ రన్ తో సమంత స్టార్ పవర్ చూపించి ఏకంగా మొదటి 100 కోట్ల సినిమాని టాలీవుడ్ హీరోయిన్స్ లో సోలోగా కొట్టి దుమ్ము లేపింది.
అయితే ఇవన్నీ ఒకెత్తు అయితే నెక్స్ట్ కంబ్యాక్ మాత్రం మరొక ఎత్తు అని చెప్పాల్సిందే. అప్పటివరకు ఆ హీరోని చాలామంది తక్కువ అంచనా వేసి ఉండొచ్చు. మార్కెట్ పరంగా కానీ ఇతర ఏ అంశంలో అయినా కూడా.. కానీ సీన్ కట్ చేస్తే ఆ హీరో ఇచ్చిన కంబ్యాక్ దెబ్బకు బాక్సాఫీస్ కూసాలు కదులుతున్నాయి.
‘ఇరుముడి’ బిగ్గెస్ట్ కంబ్యాక్ తో మాస్ మహారాజా రవితేజ ఈజ్ బ్యాక్
దర్శకుడు శివ నిర్వాణతో చేసిన ఈ ఎమోషనల్, డివోషనల్ కంటెంట్ కి మాత్రం తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ చూపిస్తున్న ఆదరణ అనన్య సామాన్యం. అసలు రవితేజకి ఒక ప్రాపర్ సినిమా తగిలితే ఇలా ఉంటుందా అనే రేంజ్ లో బుకింగ్స్, బాక్సాఫీస్ దగ్గర ఊహించని నెంబర్స్ తో ట్రేడ్ వర్గాలు షాకయ్యే విధంగా ఈ సినిమా పెర్ఫామ్ చేస్తుంది. పలు పాన్ ఇండియా సినిమాలు కూడా చేయని మ్యాజిక్ ని ఈ సినిమా చేసి చూపించడంతో రవితేజ ఇచ్చిన కంబ్యాక్ మాత్రం బిగ్గెస్ట్ కంబ్యాక్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
సో ఇలా మంచి హిట్ కోసం చాలా కాలంగా చూస్తున్న పాపులర్ స్టార్స్ అందరికీ ఈ 2027 ద్వితీయార్ధం మాత్రం బాగా కలిసొచ్చింది అని చెప్పొచ్చు.


