సూర్యతో చేయాల్సిన సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ కాదట..!

సూర్యతో చేయాల్సిన సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ కాదట..!

Published on Jul 24, 2026 12:00 AM IST

suriya venky atluri

వర్సటైల్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమా సెట్స్‌పైకి ఎలా వచ్చిందో, దీని వెనుక ఉన్న ఆసక్తికర నేపథ్యాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇటీవల పంచుకున్నాడు. నిజానికి సూర్యతో ఈ సినిమా చేయాలని తాను మొదట అనుకోలేదని, ఒక బయోపిక్ కథతో ఆయనను కలిశానని తెలిపాడు.

ఆ బయోపిక్ కథ సూర్యకు ఎంతగానో నచ్చినప్పటికీ, దానికి సంబంధించిన రైట్స్ విషయంలో కొన్ని చిక్కులు ఎదురవడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదట. అదే సమయంలో సూర్య వరుసగా రెండు బయోపిక్ చిత్రాలు పూర్తి చేసి ఉండటంతో, మళ్లీ అలాంటిదే కాకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని భావించాడట. తాను ఇప్పటికే రెండు బయోపిక్‌లు చేశానని.. తన దగ్గర ఏదైనా మంచి ఆహ్లాదకరమైన ఫ్యామిలీ కథ ఉందా? అని సూర్య అడిగినట్లు వెంకీ అట్లూరి గుర్తుచేసుకున్నాడు.

ఆ తర్వాత వెంకీ అట్లూరి.. ఒక 40 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్ల యువతి మధ్య ఉండే సంబంధం, భావోద్వేగాల చుట్టూ సాగే కథను వినిపించగా, సూర్య ఫస్ట్ నెరేషన్‌లోనే ఓకే చెప్పాడట. అలా పట్టాలెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రస్తుతం సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌గా మారింది. ఇక ఈ ఫ్యామిలీ డ్రామా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు