రామ్ చరణ్‌కు విజయవంతంగా ముగిసిన మణికట్టు శస్త్రచికిత్స.. అమెరికా నిపుణుడితో ప్రత్యేక చికిత్స

రామ్ చరణ్‌కు విజయవంతంగా ముగిసిన మణికట్టు శస్త్రచికిత్స.. అమెరికా నిపుణుడితో ప్రత్యేక చికిత్స

Published on Jul 27, 2026 8:03 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు సమస్యకు కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌లో శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. వైద్య నిపుణుల బృందం ఈ సర్జరీని నిర్వహించింది.

​ఆర్థోపెడిక్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన గంగా హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ ఈ శస్త్రచికిత్సకు నాయకత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైన క్లిష్టమైన వెన్నెముక సమస్యకు కూడా ఆయనే చికిత్స అందించారు.

​అమెరికా నిపుణుడి భాగస్వామ్యం
​చరణ్ మణికట్టు సమస్యకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు, అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ప్రత్యేకంగా ఆహ్వానించారు. చేతి, మణికట్టు శస్త్రచికిత్సలు, క్రీడాకారుల గాయాల (స్పోర్ట్స్ ఇంజరీస్) చికిత్సలో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ అలెహాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజల బృందం ఈ సర్జరీని పూర్తి చేసింది.

​ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా, సంతృప్తికరంగా ఉంది. మరో నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది.

​ఈ చికిత్స సమయంలో చిరంజీవి, సురేఖ, ఉపాసన కోయంబత్తూరులోనే ఉంటూ చరణ్‌కు తోడుగా ఉన్నారు. డాక్టర్ రాజశేఖరన్‌తో చిరంజీవి కుటుంబానికి సుదీర్ఘకాలంగా ఆత్మీయ అనుబంధం ఉంది. కాగా, రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు