పూర్తిస్థాయి నటుడిగా చలనచిత్ర రంగంలోకి ‘నారప్ప’, ‘అంబాజీపేట’ ఫేమ్ రవి ఆనంద్ చిన్నిబిల్లి

పూర్తిస్థాయి నటుడిగా చలనచిత్ర రంగంలోకి ‘నారప్ప’, ‘అంబాజీపేట’ ఫేమ్ రవి ఆనంద్ చిన్నిబిల్లి

Published on Jul 27, 2026 8:00 AM IST

కాకినాడకు చెందిన థియేటర్ కళాకారుడు, నటుడు రవి ఆనంద్ చిన్నిబిల్లి ఇకపై పూర్తిస్థాయి నటుడిగా చలనచిత్ర రంగంలో కొనసాగనున్నట్లు ప్రకటించారు. నాటకరంగంలో మంచి గుర్తింపు పొందిన ఆయన, కుటుంబ బాధ్యతల కారణంగా ఇప్పటివరకు పరిమితంగానే చిత్రాల్లో నటిస్తూ వచ్చారు. ప్రస్తుతం పూర్తిస్థాయి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా రాణించేందుకు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చేందుకు సిద్ధమవుతున్నారు.

గతంలో ‘శివకాశిపురం’ చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రవి ఆనంద్.. ‘సైరా నరసింహారెడ్డి’, ‘నారప్ప’, ‘మహానటి’, ‘డియర్ కామ్రేడ్’, ‘బెదురులంక 2012’, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ వంటి ప్రముఖ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలో నటించారు. అలాగే ‘సాయంకాలం సిత్రాలు’ బ్యానర్‌పై నిర్మాణంలోనూ భాగస్వామి అవుతూ ‘గేదెల రాజు’ చిత్రంలో సహ నిర్మాతగా, నటుడిగా వ్యవహరించారు. కళారంగంతో పాటు వెయిట్ లిఫ్టింగ్, మిమిక్రీ విభాగాల్లోనూ ఆయనకు ప్రవేశం ఉంది.

ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గువ్వల చెరువు గట్టు’ వెబ్ సిరీస్‌తో పాటు రఘు కుంచె నటిస్తున్న ‘పయనం’ చిత్రంలో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. పారితోషికం కంటే కూడా పాత్ర ప్రాధాన్యతకే తన మొదటి ప్రాధాన్యమని రవి ఆనంద్ స్పష్టం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు