ట్రైలర్ టాక్: సాలిడ్ ఫన్, యాక్షన్ తో ప్రామిసింగ్ గా ‘కొరియన్ కనకరాజు’

ట్రైలర్ టాక్: సాలిడ్ ఫన్, యాక్షన్ తో ప్రామిసింగ్ గా ‘కొరియన్ కనకరాజు’

Published on Aug 1, 2026 2:10 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన అవైటెడ్ కామెడీ హారర్ థ్రిల్లర్ చిత్రమే ‘కొరియన్ కనకరాజు’. ఇది అనౌన్స్ చేసిన నాటి నుంచే మంచి ఫన్ ప్రమోషన్స్ తో మేకర్స్ ఇప్పుడు వరకు తీసుకొచ్చారు. ఇలా ఫైనల్ గా సినిమా తాలూకా ట్రైలర్ కట్ ని విడుదల చేశారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేసిన ఈ ట్రైలర్ మాత్రం వరుణ్ కి మంచి కంబ్యాక్ ఇచ్చేలానే కనిపిస్తుంది.

ఆల్రెడీ సినిమా కాన్సెప్ట్ పై అందరికీ ఓ ఐడియా ఉంది కానీ ట్రైలర్ లో మాత్రం అంతకు మించి లోతుకి తీసుకెళ్లారు మేకర్స్. ఎక్కడో ఉండే కనకరాజుకి అసలు సంబంధమే లేని కొరియన్ దెయ్యానికి లింక్ పెట్టి సాలిడ్ యాక్షన్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ ని దర్శకుడు నింపేశారు. ఇక రెండు షేడ్స్ లో వరుణ్ తేజ్ మరోసారి తనలోని పెర్ఫామర్ ని చూపించడం విశేషం. హీరోయిన్ రితికా నాయక్ బ్యూటిఫుల్ గా కథలో కీలకంగా కూడా కనిపిస్తుంది.

అలాగే కమెడియన్ సత్య సహా బుల్లిరాజు రేవంత్ వంటి వాళ్ళు సాలిడ్ ఫన్ ని ఇందులో యాడ్ చేశారు. ఇక ట్రైలర్ ఎండింగ్ లో రెండు ఆత్మల నడుమ ఫైట్ సీక్వెన్స్ లా చూపించడంతో క్లైమాక్స్ పార్ట్ మాత్రం అదిరేలా ఉంటుంది అనిపిస్తుంది. ఇక ఇందులో థమన్ స్కోర్ కూడా మంచి ప్లస్ గా నిలవగా మేకర్స్ నిర్మాణ విలువలు కూడా టాప్ లెవెల్లో కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఆగస్ట్ 7న థియేటర్స్ లో సాలిడ్ ఫన్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ హారర్ డ్రామా ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు