మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లోని క్లాసిక్ మాస్ హిట్ చిత్రాలలో ఒకటైన ‘ముఠా మేస్త్రి’ థియేటర్లలోకి మళ్లీ రానుంది. 4K టెక్నాలజీతో సరికొత్త డిజిటల్ వర్షన్‌గా సిద్ధమైన ‘ముఠా మేస్త్రి 4K’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది.
ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మాస్ ఎంటర్టైనర్లో చిరంజీవి సరసన మీనా, రోజా హీరోయిన్లుగా నటించారు. రాజ్-కోటి అందించిన చార్ట్‌బస్టర్ పాటలు, చిరు నోట మాస్ డైలాగ్స్ ఇప్పటికీ అభిమానులను విశేషంగా అలరిస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ బర్త్‌డే కానుకగా మళ్లీ వెండితెరపై మేస్త్రి మాస్ హంగామాను వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


