పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. మిగతా హీరోస్ లా కాకుండా ప్రభాస్ సోషల్ మీడియాలో లేట్ గా ఎంటర్ అవ్వడం జరిగింది. అది కూడా తాను మితంగానే సోషల్ మీడియా వాడుతాడని తెలిసిందే. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా డీపీ ఫోటో మార్చడం కూడా వైరల్ గా మారింది.
ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో ఎంటర్ అయ్యాక తాను తన ఎపిక్ హిట్ బాహుబలి ఫోటోని డీపీ గా పెట్టుకోవడం జరిగింది. ఇలా అది పెట్టుకున్న ఏడేళ్ల తర్వాత ప్రభాస్ మార్చిన ఒకే ఒక్క ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. మరి అది ఏదో కాదు ఇప్పుడు చేస్తున్న ‘ఫౌజి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని పెట్టడంజ్ జరిగింది.
దీనితో ఇన్నాళ్లలో ప్రభాస్ ఎప్పుడు మార్చని డీపీ అది కూడా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ దీనినే పెట్టడంతో ఫౌజి సినిమా విషయంలో ప్రభాస్ అంత ఆసక్తిగా ఉన్నాడా అనే టాక్ మొదలైంది. ఇలా మొత్తానికి ఏడేళ్ల తర్వాత ప్రభాస్ మార్చిన డీపీ కోసం కూడా ఇపుడు నేషనల్ వైడ్ గా చర్చగా మారింది. ఇక ఫౌజి సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ డిసెంబర్ 3న విడుదల చేస్తున్నారు.


