విజయ్ దేవరకొండ అంటేనే ప్రేక్షకులకు గుర్తొచ్చే ఇమేజ్ రౌడీ. పైగా తనకు బాగా కలిసొచ్చే రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ విజయ్ చేస్తున్న కొత్త సినిమా ‘రౌడీ జనార్దన’. దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ క్యారెక్టరైజేషన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. పైగా సినిమాలో గ్రామీణ నేపథ్యమే అసలైన బలం అని తెలుస్తోంది. ముఖ్యంగా కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని, రాజకీయాలు, ఆధిపత్య పోరాటాల మధ్య ఒక రఫ్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తే.. ఈ కోణంలో కథ సాగనుంది.
పైగా ఈ సినిమాలో తండ్రి సెంటిమెంట్ కూడా ఉందట. సినిమా కేవలం యాక్షన్‌కు పరిమితం కాకుండా, ఎమోషనల్ డ్రామా కూడా చాలా బాగుంటుందని.. మొత్తానికి ఫాదర్ సెంటిమెంట్ చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. దీనికితోడు ఈ సినిమా, పాన్ ఇండియా టార్గెట్ తో రాబోతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
కాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.


