కేవీఎన్ అధినేతకు ‘కాకా’ స్పెషల్ బర్త్ డే విషెస్..!

కేవీఎన్ అధినేతకు ‘కాకా’ స్పెషల్ బర్త్ డే విషెస్..!

Published on Aug 24, 2026 7:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. డైరెక్టర్ బాబీ మెగాస్టార్‌ను ఒక మధ్యతరగతి వ్యక్తిగా మరియు గ్యాంగ్‌స్టర్‌గా అత్యంత స్టైలిష్‌గా ప్రెజెంట్ చేసిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ​ప్రముఖ నిర్మాత వెంకట్ నారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఒక బీటీఎస్ వీడియోను విడుదల చేసింది.

ఈ వీడియోలో చిరంజీవి, బాబీ, నిర్మాత సరదాగా గడుపుతూ కనిపించారు. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమా అనుభూతిని అందించడానికి నిర్మాత వెంకట్ నారాయణ బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
​ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో అనశ్వర రాజన్, నివేతా పేతురాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత వస్తున్న రెండో చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్థానంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు