షాకింగ్ : ‘స్పిరిట్’కు A సర్టిఫికెట్ ఖాయమని తేల్చిన సందీప్ రెడ్డి వంగా

షాకింగ్ : ‘స్పిరిట్’కు A సర్టిఫికెట్ ఖాయమని తేల్చిన సందీప్ రెడ్డి వంగా

Published on Aug 26, 2026 1:24 AM IST

సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘స్పిరిట్’ మరోసారి వార్తల్లో నిలిచింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాకు సెన్సార్ బోర్డ్ నుండి ‘A’ సర్టిఫికెట్ రానుందని సందీప్ రెడ్డి వంగా స్వయంగా స్పష్టం చేశాడు. ‘రోమాంచకం’ మూవీ ట్రైలర్ లాంచ్‌లో ఆయన ఈ విధంగా రెస్పాండ్ కావడం తో స్పిరిట్ పై మరోసారి హైప్ క్రియేట్ అయింది.

తనదైన మార్క్‌తో రా అండ్ రస్టిక్ యాక్షన్‌గా మాత్రమే కాకుండా ఇంటెన్స్ ఎమోషన్స్ ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఈ ప్రకటనతో అర్థమవుతోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల తరహాలో ‘స్పిరిట్’లో కూడా కంటెంట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా కథను పూర్తి రా గా చూపించబోతున్నట్లు దర్శకుడు తేల్చిచెప్పాడు.

ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మార్చి 2027 విడుదల లక్ష్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఈ లేటెస్ట్ కామెంట్స్‌తో అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు