అక్కడ బ్లాక్‌బస్టర్.. ఇక్కడ మాత్రం పేలని బాంబు..!

అక్కడ బ్లాక్‌బస్టర్.. ఇక్కడ మాత్రం పేలని బాంబు..!

Published on Sep 9, 2026 9:01 PM IST

మమితా బైజు, నివిన్ పౌలీ నటించిన ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ కేరళ, ఓవర్సీస్‌లో ప్రభంజనం సృష్టిస్తూ రూ. 300 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. అయితే, సెప్టెంబర్ 4న విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది.

నాలుగు వారాల ఓటీటీ నిబంధన వల్ల పీవీఆర్, ఐనాక్స్ వంటి ప్రముఖ థియేటర్లు ఈ చిత్రాన్ని ప్రదర్శించకపోవడం, ఆకట్టుకోని టైటిల్ వల్ల తెలుగు వెర్షన్ తొలి నాలుగు రోజుల్లో కేవలం రూ. 2.5 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది. అయితే, ఈ చిత్రాన్ని ప్రింట్, పబ్లిసిటీ ఖర్చులు మరియు 10% కమిషన్ ప్రాతిపదికన సేఫ్ డీల్‌పై పంపిణీ చేసిన మైత్రి మూవీ మేకర్స్‌కు పెద్దగా నష్టాలు రావు.

కేరళలో రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, సరైన విడుదల వ్యూహం లేకపోతే ఎంతటి హిట్ సినిమా అయినా తెలుగు మార్కెట్‌లో ప్లాప్‌గా మిగిలిపోతుందనడానికి ఈ చిత్రమే ఉదాహరణ.

తాజా వార్తలు