యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ గ్రాఫిక్స్ పనుల ఆలస్యం వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం తుది దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా 2026లో విడుదల కాదంటూ వస్తున్న వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది.
అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సోలోగా విడుదల చేసేందుకు అనువైన తేదీని వెతుకుతున్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో రజినీకాంత్ ‘జైలర్ 2’, అలాగే ‘రణబాలి’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో, థియేటర్ల కొరత లేకుండా చూసుకునేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
‘కార్తికేయ 2’ వంటి పాన్-ఇండియా హిట్ తర్వాత నిఖిల్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల ప్రక్రియ పూర్తయిన వెంటనే, తన తదుపరి ప్రాజెక్ట్లైన ‘ది ఇండియా హౌస్’, ‘కార్తికేయ 3’ సినిమాల షూటింగ్స్ వేగవంతం చేయాలని నిఖిల్ భావిస్తున్నాడు.


