‘బాలయ్య – కొరటాల’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

‘బాలయ్య – కొరటాల’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

Published on Sep 28, 2026 5:00 PM IST

Koratala Siva

కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్ డేట్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీలో బాలయ్య నటించే పాత్రల పై క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. బాలకృష్ణ రెండు వేర్వేరు పాత్రల్లో కనిపిస్తారట. తండ్రి పాత్రలో, అలాగే కొడుకు పాత్రలో కూడా బాలయ్య కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయనున్నారు.

పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాలయ్య సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. ఇక తన గాయం నుంచి బాలయ్య వేగంగా కోలుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఎలాగూ దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాలో రాజకీయ అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించనున్నారు.

తాజా వార్తలు