ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఇష్టం : స్నేహ ఉల్లాల్

ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఇష్టం : స్నేహ ఉల్లాల్

Published on Oct 20, 2011 3:55 AM IST

‘హాట్ & స్వీట్’ మేగి బాటిల్ వంటి అమ్మాయి స్నేహ ఉల్లాల్. ఆమె తన తియ్యని అమాయకపు చూపులతో మిమ్మల్ని సమ్మోహన పరచుగలదు, అంతే కాదు. ఆమె అనుకువకు తెలియకుండానే ఆకర్షితులౌతారు. Thimbu ప్రొడక్షన్స్ ఆఫీసు వద్ద 123 తెలుగు.కాం ఆమెతో ముఖాముఖి మాట్లాడింది. ఈ చిట్ చాట్ లో స్నేహ, తన వృత్తి, సాధారణ జీవితం, మరియు ఆమె లక్ష్యాలు గురించి ధారాళముగా సమాధానాలిచ్చింది.

ప్రశ్న. విడుదలకు సిద్దంగా ఉన్న మడత కాజా సినిమా పై మీ అంచనాలు ఏమిటి?

సమాధానం: ఈ చిత్ర విజయం ఫై నాకే డౌట్ లేదు. అందుకే నేను చాలా కూల్ గా ఉన్నా. ఇంత రిలాక్స్డ్ గా ఉండటం నా లైఫ్ లో ఫస్ట్ టైం. సల్మాన్ ఖాన్ తో నేను చేసిన చిత్రం విడుదల రొజూ కొంత నెర్వస్ ఫీలయ్యా. అయితే మడత కాజా విషయంలో ఈ ఇబ్బంది లేదు.

ప్రశ్న: ఈ చిత్రంలో హైలెట్స్ ఏమిటి?

సమాధానం: నా పాత్రలో పూర్తి స్థాయీ కామెడీ ఉంటుంది. మంచి డాన్సు అందించేందుకు ఏంతో కష్ట పడ్డ. ఇంతకూ ముందు ఎన్నడూ లేని విధంగా అప్పీరెన్స్ విషయంలోనూ పర్సనల్ కేర్ తీసుకున్నా.
ప్రశ్న: అప్పీరెన్స్ విషయంలో పర్సనల్ కేర్ అంటే ?

సమాధానం: సాధారణంగా నా మ్యాకప్ గురించి దర్శకుడు, చిత్ర యూనిట్ కేర్ తీసుకుంటారు. అయితే మడత కాజా చిత్రం కోసం నేను ప్రత్యేక శ్రద్ధ చూపాను. సొంత దుస్తుల నుంచి, ఫోటోగ్రఫి వరకు ప్రతీ సీన్ ఎలావచ్చిందని మానిటర్ లో పరిశీలించేదాన్ని.

ప్రశ్న: మీరు ఆల్రెడీ అందమైన అమ్మాయి కదా?

సమాధానం : (నవ్వుతూ) అవునుకానీ, ప్రతీ అమ్మాయి ఇంకా అందంగా కనిపించాలనుకుంటుంది కదా.

ప్రశ్న : కొత్త డైరెక్టర్ తో పనిచేయటం ఎలా ఉంది?

సమాధానం : సీతారామ రాజు చాలా సమర్ధత కల డైరెక్టర్. కొత్తగా వచ్చిన దర్శకుడితో చేస్తున్నామన్న ఫీలింగ్ మాకు ఎప్పుడూ కలగలేదు. చాలా కూల్ అండ్ కంఫోర్ట్. అతనికి ఎంకావాలో బాగా తెలుసు. అతనితో చేయటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. నిజం చెప్పాలంటే నేను పనిచేసిన వాటిల్లో ఇది అత్యుత్తమ ప్రొడక్షన్ హౌస్. వీళ్ళకి లేడీస్ ని ఎలా ట్రీట్ చేయాలో బాగా తెలుసు. ప్రొడ్యూసర్ ఒక జంటిల్మన్. వీరేప్పుడు అవకాశం ఇచ్చినా పనిచేయటానికి నేను రెడీ.

ప్రశ్న: కామెడీ పాత్రలు చేయటంలో నరేష్ నిష్ణాతుడు. అలాంటి వ్యక్తితో చేస్తుంటే ఏమైనా నెర్వస్ ఫీలయ్యారా ?

సమాధానం: చాలా.. కానీ ఇదంతా ఇంకా మంచిగా యాక్ట్ చేయటానికే ఉపయోగపడింది. నరేష్ చాలా మంచి కో- స్టార్. మేమిప్పుడు మరింత ఫ్రెండ్స్ అయ్యాం. ఎప్పుడూ సరదాగా ఉండే నరేష్ తన తండ్రి మరణ వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రశ్న : ఇండస్ట్రీ లో మీ స్నేహితులు?

సమాధానం : లక్ష్మి మంచు, మనోజ్, నాకు క్లోజ్ ఫ్రెండ్స్. సినీ పరిశ్రమలో డిప్లొమాటిక్ గా ఉండటం అవసరం. దురదృష్టం నాకదిలేదు.

ప్రశ్న : చివరిగా, మీ డ్రీం పాత్రలు, ప్రాజెక్టులు గురించి చెప్పండి?

సమాధానం: నాకు చిన్న, పెద్ద ప్రాజెక్టులన్న తారతమ్యం ఏమీ లేదు. ప్రతీదీ వర్కే. నాకు నచ్చితే ఏపాత్ర అయినా చేస్తా. సైకో కిల్లర్ గా నటించాలని ఉంది. ఆ తరహ పాత్రలు చేయాలంటే నాకిష్టం. దేవుడు ఎప్పుడూ తనకు మంచి పాత్రలు ఇస్తాడని ఆశిస్తున్నా.

స్మార్ట్ అండ్ స్వీటీ, స్నేహ ఉల్లాల్ తో ఇంటర్వ్యూ ఇలా ముగిసింది… గైస్.. మరి ఈ బ్యూటీ మడత కాజా సినిమాలో అల్లరి నరేష్ తో ఎలా కదం తొక్కిందో చూసేందుకు రెడీ అవుతారా..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు