ఇంటర్వ్యూ : ఎల్బీడబ్లూ చిరాకులో రొటీన్ లవ్ స్టొరీ ఆలోచన పుట్టింది – ప్రవీణ్ సత్తారు

ఇంటర్వ్యూ : ఎల్బీడబ్లూ చిరాకులో రొటీన్ లవ్ స్టొరీ ఆలోచన పుట్టింది – ప్రవీణ్ సత్తారు

Published on Nov 15, 2012 3:25 AM IST


విజయనగరంలో పుట్టి, మద్రాస్ యూనివర్సిటీలో ట్రిపుల్ ఈ చేసి ఆ తరువాత అమెరికాలో ఐబీఎం కంపెనీలో ఎస్ఎపి కన్సల్టెంట్ గా పనిచేసిన ప్రవీణ్ సత్తారు అమెరికా లైఫ్ వదిలేసి ఇండియాకి వచ్చి ‘ఎల్బీడబ్లూ’ సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు. మొదటి సినిమాకి ప్రశంసలు అందుకున్నా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. మొదటి సినిమాకి చేసిన తప్పులు రెండవ సినిమా ‘రొటీన్ లవ్ స్టొరీ’లో సరిదిద్దుకున్నానని, రొటీన్ లవ్ స్టొరీ గురించి ప్రవీణ్ చెప్పిన ముచ్చట్లు.

ప్ర : అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా మంచి పొజిషన్లో ఉన్న మీకు సినిమాల్లోకి రావాలని ఎందుకనిపించింది?
స : అమెరికాలో ఉన్నప్పుడు తమిళ్, తెలుగు అన్ని భాషల ఫ్రెండ్స్ కలిసినపుడు ఎవరి భాషల వాళ్ళు వల్ల గొప్ప సినిమాలు చెబుతుంటే తెలుగు వాడినైన నాకు విశ్వనాధ్ గారి సినిమాలు, అయితే, అనుకోకుండా ఒక రోజు ఇలా కొన్ని సినిమాలు మాత్రమే చెప్పాల్సి వచ్చేది. మనం ఎందుకు ఇలాంటి సినేమాలు తీయలేము అనే ఆలోచన పుట్టింది. నేను ఫ్లైట్ జర్నీ చేసే సమయాల్లో 3 స్క్రిప్ట్స్ రాసుకుని ఫ్రెండ్స్ కి చూపిస్తే వాళ్ళు విజువలైజ్ చేసుకుని బావుందని చెప్పడం, అదే సమయంలో అమెరికా లైఫ్ బోర్ కొట్టి ఇండియాకి రావాలనుకోవడం అనుకోని ఇండియాకి వస్తే ఏం చేయాలనే అలోచించి సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాను.

ప్ర : సినిమాలంటే చిన్నప్పటి నుండే ఇంట్రస్ట్ ఉందా?
స : నేను చిన్నప్పుడు సినిమాలకి అస్సలు వెళ్ళే వాడిని కాదు. మా పేరెంట్స్ సినిమాలకి వెళ్ళిన నన్ను పక్కింట్లో వదిలి వెళ్ళే వాళ్ళు. టెన్త్, కాలేజ్ టైంకి కొంచెం ఇంట్రస్ట్ ఉండేది కానీ పిచ్చి అయితే లేదు.

ప్ర : టైటిల్ రొటీన్ లవ్ స్టొరీ అని పెట్టారు సినిమా కూడా రొటీన్ గా ఉంటుందా? వెరైటీ గా ఉంటుందా?
స : సినిమాల్లో అయినా, నిజ జీవితంలో అయినా జరిగిన ఏ లవ్ స్టొరీ తీసుకున్నా ప్రేమించుకోవడం, పెద్దలని ఒప్పించడం, వారు ఒప్పుకోకపోతే ఎదిరించి పెళ్లి చేసుకోవడం ఇవే కనిపిస్తాయి. పక్క వాడి లవ్ స్టొరీ మనకి రొటీన్ గా ఉంటుంది. ఎవరి లవ్ స్టొరీ వారికీ వెరైటీగా ఉంటుంది. ప్రేమలో ఉన్న వారికి అది వెరైటీ చూసే వాళ్ళకి రొటీన్. ఆ పాయింట్ బేస్ చేసుకుని ఈ సినిమాకి రొటీన్ లవ్ స్టొరీ అనే టైటిల్ పెట్టడం జరిగింది. కాకపోతే సినిమా మాత్రం ఇద్దరు ప్రేమికుల మధ్య డీప్ రిలేషన్ షిప్ మీద ఆధారపడి ఉంటుంది. వారి కొట్టుకోవడం, తిట్టుకోవడం ఫన్నీ మూమెంట్స్ అన్నీ ఇందులో చూపిస్తున్నాం.

ప్ర : మీ మొదటి సినిమాలు రిలేషన్ షిప్ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ జోనర్ లోనే సినిమాలు తీయడానికి ఏమైనా కారణం ఉందా?
స : ఎల్బీడబ్లూ రిలేషన్ షిప్ లో ఉన్న తీవ్రతని చూపిస్తూ ఉంటుంది. సో ఎల్బీడబ్లూ అనేది ఎమోషనల్ లవ్ స్టొరీ. రొటీన్ లవ్ స్టొరీ విషయానికి వస్తే ఇద్దరు ప్రేమికుల మధ్య రిలేషన్ షిప్ ఫన్నీ యాంగిల్ లో చూపిస్తున్నాం. ఆ స్టొరీకి ఈ స్టొరీకి సంభందం లేదు.

ప్ర : ఎల్బీడబ్లూ, రొటీన్ లవ్ స్టొరీ రెండు సినిమాలని గమనిస్తే అర్బన్ ఆడియెన్స్ ని, ఓవర్సీస్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసుకుని తీసినట్లు అనిపిస్తుంది, కావాలనే అలా తీస్తున్నారా?
స : అలా ఏమి లేదండి. అర్బన్ వారికైనా, రూలర్ వారికైనా, ఎవరికైనా ఎమోషన్స్ అనేవి ఎవరికైనా ఒకటే ఉంటాయి పరిస్థితులు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. ఈ రెండు కథలు సిటీలో బేస్ అయినవి. అంతే కానీ అర్బన్ ఆడియెన్స్ మాత్రమే టార్గెట్ చేసిందనేది కాదు.

ప్ర : ఈ సినిమాకి రొటీన్ లవ్ స్టొరీ అని ఎందుకు పెట్టారు?
స : రొటీన్ లవ్ స్టొరీ అనేది సేఫెస్ట్ టైటిల్. పైన చెప్పుకున్నట్లు ఎవరి లవ్ స్టొరీ స్టొరీ అయిన థర్డ్ పర్సన్ కి రొటీన్ గానే అనిపిస్తుంది. మా సినిమా వెరైటీ లవ్ స్టొరీ అని చెప్పుకోవడం ఈ రోజుల్లో కామన్ అయిపొయింది. మా సినిమా కూడా డిఫరెంట్ గా ఉంటుంది కానీ రొటీన్ లవ్ స్టొరీ అని పెడితే మేం చూపించే వెరైటీ చూసి థ్రిల్ ఫీలవుతారు కదా. ఇందులో వెరైటీ ఏంటి అని అడిగితే అన్ని సినిమాల్లాగా ఫస్ట్ టెన్ మినిట్స్ లో హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ ముందు పీక్స్ తీసుకెళ్ళడం, ఇంటర్వెల్ బాంగ్ లాంటి రొటీన్ బేసిక్ స్ట్రక్చర్ ఉండదు.

ప్ర : లవ్ స్టొరీ అంటే ఎంతో మంది చాకొలెట్ బాయ్స్ లాంటి హీరోలు ఉండగా సందీప్ కిషన్ ని ఎందుకు ఎంచుకున్నారు?
స : చాకొలెట్ కాదు కాబట్టి సందీప్ కిషన్ ని తీసుకున్నాం. ప్రస్థానం సినిమాలో సైకో క్యారెక్టర్లో యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. నాకు యాక్టర్ చాలు చాకొలెట్ బాయ్స్, బాగా డాన్స్ చేయాలి అలాంటి వాళ్ళు ఈ సబ్జెక్టుకి అవసరం లేదు. ఈ సినిమా తరువాత అందరూ ప్రస్థానం సందీప్ కిషన్ అనడం మానేసి రొటీన్ లవ్ స్టొరీ సందీప్ కిషన్ అంటారు (నవ్వుతూ).

ప్ర : రేజీనా కాస్టింగ్ ఎలా జరిగింది?
స : రేజీనా యాక్ట్ చేసిన హౌ టు మెస్ అప్ ఇన్ లవ్ తమిళ్ షార్ట్ ఫిలిం చేసింది. అదే షార్ట్ ఫిలింని తెలుగులో లవ్ ఫెయిల్యూర్ అని తీసారు. ఆ షార్ట్ ఫిలింలో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి సెలెక్ట్ చేసుకున్నాం. సీన్ చెప్పగానే అర్ధం చేసుకొని బాగా నేచురల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఈ సినిమా తరువాత ఆమెకి పెద్ద సినిమాల్లో చాన్సులు వస్తాయి.

ప్ర : మీ రెండు సినిమాలకి నిర్మాత, దర్శకుడు మీరే కదా. ఫస్ట్ సినిమాకి జరిగిన తప్పులు మేకింగ్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ ఈ సినిమాకి జరగకుండా చూసుకున్నారా?
స : నా ఫస్ట్ సినిమా అనుభవాన్నే మూడు, నాలుగు సినిమాల అనుభవంగా ఫీలవుతును. ఎందుకంటే ఆ టైంలో మేకింగ్, రిలీజ్ విషయాల్లో చాలా ప్రాబ్లమ్స్ పేస్ చేయాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా సినిమా రిలీజ్ విషయంలో అనుభవం లేకపోవడం వల్ల సినిమా కరెక్ట్ ఆడియెన్స్ కి చేరలేదు. ఎల్బీడబ్లూ మేకింగ్ టైంలో వచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల ఆలోచనే ఈ రొటీన్ లవ్ స్టొరీ. ఈ మూవీకి మేకింగ్లో, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో, రిలీజ్ విషయంలో ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకున్నాం. సినిమా వర్క్ మొత్తం పూర్తయింది. ఇప్పుడంతా ప్రమోషన్ మీదే కాన్సట్రేట్ చేస్తున్నాం. ఆల్రెడీ సీడెడ్ ఏరియాల్లో ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసాం. కింది సెంటర్స్ కంటి రూరల్ ఏరియాలలో రొటీన్ లవ్ స్టొరీ అనే పేరు విన్నారా అని వంద మందిని అడిగితే 90 మంది వినలేదనే చెబుతారు. అందుకే ప్రమోషన్ చాలా జాగ్రత్తగా చేస్తున్నాం.

ప్ర : మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గురించి చెప్పండి.
స : లవ్ స్టొరీ సినిమాలకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్.మిక్కీ ఇప్పటికే కొన్ని సినిమాలకు మంచు మ్యూజిక్ ఇచ్చాడు. మా సినిమాకి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మీరు మ్యూజిక్ వింటే చాల బావుంటుంది, మ్యూజిక్ కంటే విజువల్ గా ఇంకా బావుంటుంది, విజువల్ గా కంటే సినిమా ఫ్లోలో ఇంకా చాలా బావుంటుంది.

రొటీన్ లవ్ స్టొరీ మంచి హిట్ సాధించి ప్రవీణ్ సత్తారుకి మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇంతటితో ముగిస్తున్నాం.

ఇంటర్వ్యూ : అశోక్ రెడ్డి .ఎమ్

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు