ప్రత్యేక ఇంటర్వ్యూ : శేఖర్ కమ్ముల – నేను చేసిన చిత్రాలలో కష్టమయినది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

ప్రత్యేక ఇంటర్వ్యూ : శేఖర్ కమ్ముల – నేను చేసిన చిత్రాలలో కష్టమయినది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

Published on Sep 13, 2012 9:43 AM IST

తెలుగు పరిశ్రమలో శేఖర్ కమ్ముల స్థానం ఎప్పుడు ప్రత్యేకమే అందరిలా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లతో కాకుండా తనదయిన శైలితో యువతతో పాటు కుటుంబాలను కూడా ఆకట్టుకోగల చిత్రాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడు అనే చెప్పాలి. ఆయన మృదుస్వభావి మరియు మేధావి అన్న విషయం అందరికి తెలిసిందే. ఈరోజు ఆయన మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంభాషణ మొత్తం అయన కార్ లో వెళుతుండగా జరిపింది. అయన కార్ మొత్తం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సామగ్రితో నిండిపోయుంది ఇది చూస్తుంటే అయన ఈ చిత్రం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నారో తెలిసిపోతుంది. ఆయన ఈ సంభాషణలో “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రం గురించి , అయన సిద్దాంతాల గురించి మరియు ఆయన్ని చిత్రాల వైపు నడిపించిన శక్తుల గురించి చెప్పారు.

ప్ర) బడ్జెట్ విషయంలో మీ కెరీర్లో “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” పెద్ద చిత్రం. దీని బట్టి చూస్తే మీరు పెద్ద చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారా?

జ) నాకు అయితే చేసిన ప్రతి చిత్రం పెద్ద చిత్రమే నేను చేసిన మొదటి చిత్రం “ఆనంద్” నుండి నేను చేసిన ప్రతి చిత్రం నా పరిధి ని దాటి చేసిందే. నేను 25 పైసలుగా ఉన్నప్పుడు “ఆనంద్” చేశాను దాని మీద రెండు రూపాయలు పెట్టాను. నా పరిధి పెంచుకోగలనన్న నమ్మకం నాకు ఉంది. “ఆనంద్” మరియు “గోదావరి” చిత్రానికి ఉపయోగించిన లైటింగ్ స్కీమ్స్ కానివ్వండి ఇంకేదయినా కానివ్వండి నేను అనుకున్న విధంగా మరొకరు చిత్రం చెయ్యకూడదు అనుకోని చేస్తాను. కాబట్టి నేను అనుకోకుండానే “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రం నా కెరీర్లో భారీ చిత్రం అయ్యింది.

ప్ర) మీ చిత్రంలో ముగ్గురు అగ్ర హీరోయిన్లు ఉండటం ఇదే మొదటి సారి ఇదేమయిన వ్యాపార నిర్ణయమ?

జ) అదేం కాదు శ్రియ పాత్రకి మాకు కాస్త స్టార్ అప్పీల్ ఉన్నవాళ్లు కావలసి వచ్చింది కాబట్టి శ్రియని సంప్రదించాను. అమల గారు ఈ చిత్రంలో చెయ్యడం మా అదృష్టం అని చెప్పాలి ఆ పాత్రకి అమల గారు సరిగ్గా సరిపోతారని ఒకరు చెప్పారు కాబట్టి ఆమెను ఎంచుకోవడం జరిగింది. ఈ చిత్రంలో ఆమె ప్రధాన ఆకర్షణ కానుంది , అంజలా జవేరిని నిర్మా యాడ్లో చూసాను ఇంకా కూడా ఆమె అందంగానే ఉంది ఈ పాత్రకి ఆమె బాగా సరిపోయారు.

ప్ర) కథను సిద్దం చేసుకునేప్పుడు మీ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని సిద్దం చేసుకుంటారా?

జ) నేను తీసే జోనర్ చిత్రాలకి ఇంత మార్కెట్ ఉండటం నా అదృష్టం నేను తీసే చిత్రాలు నా నిజ జీవితానికి అద్దం పడుతుంది. నేను తృప్తి చెందాకే ఏ పాత్రని అయినా ఎంచుకుంటాను తరువాత ఆ పాత్ర తీరు తెన్నులను సిద్దం చేసుకుంటాను. ఇది చాలా కష్టమయిన పని. నా వరకు చిత్రాలు చెయ్యడం క్రియేటివిటీ కి సంభందించిన విషయం కాబట్టి నేనెప్పుడు ఏదో నిరూపించాలని చిత్రాలు చెయ్యలేదు. నేను చేసే చిత్రాలు భావితరాలకి గతంలో జీవితాలు ఎలా ఉన్నాయో చూపించేలా ఉంటాయి. ఉదాహరణకి “హ్యాపీ డేస్” చిత్రం విద్యార్థి జీవితం ఎలా ఉంటుందో చూపెడితే “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” మధ్య తరగతి కుటుంబాలున్న కాలనీ జీవితం ఎలా ఉండేదో చుపెట్టేలా ఉంటుంది. ఇలాంటి చిత్రాలను చెయ్యడానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు

ప్ర) ఫిల్మి ఫార్ములాస్ కి దూరంగా ఇలాంటి శైలిలో చిత్రాలు చెయ్యడం కష్టమనిపిస్తుందా?
జ) అవును ఇలాంటి చిత్రాలు చెయ్యడం కాస్త కష్టమయిన పనే. ఇలాంటి చిత్రాలలో ప్రేక్షకులు లీనమయ్యేలా చెయ్యడం చాల కష్టమయిన పని. నేను చేసిన చిత్రాలలో “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రం చాలా కష్టమయిన చిత్రం. ఈ చిత్రం మీద నేను చాలా కష్టపడ్డాను ఈ కథను రెండు మూడు సార్లు రాయవలసి వచ్చింది. నేను రాసిన వాటిలో లీడర్ చిత్ర కథ రెండు వారాలలో సులభంగా పూర్తయ్యింది.

ప్ర) అగ్ర తారలతో చిత్రాలు చేస్తారా ? కొద్ది రోజుల క్రితం మీరు అగ్ర హీరో కోసం కథ సిద్దం చేసుకుంటున్నట్టు సమాచారం….

జ) నేను ముందు కథను రాసి తరువాత ఆ కథకి సరిపోయే వాళ్ళ కోసం వెతుకుతాను. ఒకవేళ నా పాత్రకి అగ్ర తార సరిపోతారు అనుకుంటే సిగ్గు లేకుండా వారి వెంట పడతాను వారు ఒప్పుకునేంత వరకు వదలను ఎలాగయితే ఈ చిత్రం కోసం అమల గారిని ఒప్పించానో అలా. నా భవిష్యత్తు కథలలో ఏదయినా అగ్ర తారకి సరిపోతుంది అనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను.

ప్ర) ఇప్పుడు మన సినిమాల్లో మిగిలి ఉన్నది సంగీతం మరియు డాన్సులు మాత్రమే అని కొంత కాలం క్రితం అన్నారు. అది మిక్కీ జె మేయర్ సంగీతంలో కనిపించిందా?

జ)మిక్కీ సంగీతం నన్ను ఒక అద్భుతమైన ఫీల్ కి గురి చేస్తుంది మరియు అలాంటి సంగీతం ఈ సినిమాకి అవసరం. ‘లీడర్’ మరియు ‘ హ్యాపీ డేస్’ సినిమాల సంగీతం కూడా యువకులని బాగా ఆకట్టుకుంది. రీ రికార్డింగ్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో తెలుగు నేటివిటీ టచ్ ఉండాలని చెప్పాను, అలాగే అవసరమైనప్పుడు మిక్కీతో కలిసి పని చేసాను. నేను మొదట్లో తీసిన ‘ఆనంద్’ మరియు ‘గోదావరి’ సినిమాల్లో కూడా పూర్తి సాంప్రదాయబద్దమైన సంగీతాన్ని ఎంచుకున్నాను. మిక్కీ నాకు ఏది కావాలో అది ఇస్తాడు.

ప్ర) సినిమాలు కాకుండా మీ ఇతర అభిరుచులేంటి?

జ)సినిమాలు కాకుండా నా ఇద్దరు పిల్లలైన వందన మరియు విభావనిలతో గడపడానికి చాలా ఇష్టపడతాను. నా పిల్లలతో గల్లీ క్రికెట్ అడుతుంటాను. నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం, నా కార్లో ఒంటరిగా మరియు స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం అంటే నాకిష్టం. అందుకే నా కారు ఒక మొబైల్ హోంలా ఉంటుంది. ముఖ్యంగా నాకు యు.ఎస్ లో డ్రైవింగ్ చెయ్యడం అంటే చాలా ఇష్టం. నేను యు.ఎస్ లో చదుకున్నాను మరియు ఆ దేశం నుంచి చాలా నేర్చుకున్నాను. నాకు యు.ఎస్ మొత్తం తిరగడం అంటే చాలా ఇష్టం అందుకే నా ఇంట్లో ఉంటే యు.ఎస్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవి కాకుండా రోడ్ సైడ్ ఇరాని చాయ్ మరియు మినెర్వాలో టిఫిన్ అంటే ఇష్టం. ఇవేమీ లేకపోతే పద్మారావు నగర్లోని మా ఇంట్లో కొంత సమయం గడుపుతాను.

ప్ర) ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా నుంచి మేము ఏమేమి ఆశించవచ్చు?
జ) ఈ చిత్ర కథాంశం కొంత వరకూ ‘హ్యాపీ డేస్’ ని పోలి ఉంటుంది. ఈ సినిమా ద్వారా రాబోయే తరానికి ఒక చిన్న మధ్య తరగతి కాలనీలో ఉండే వారి జీవితాలను చూపించాలని అనుకున్నాను. ప్రస్తుతం మనకు ఇది చాలా అవసరమని ఈ సినిమా తీశాను. ప్రస్తుతం ఇండియాలో సోషియో ఎకనమిక్ పరంగా చాలా మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సందర్బంలో నేను నా అమాయకత్వాన్ని కోల్పోఎలోగా ఇలాంటి సినిమా ఒకటి తీయాలనుకున్నాను.

దీంతో శేఖర్ కమ్ములతో మా సంభాషణ ముగిసింది అయన ముఖ్యమయిన వాళ్ళని కలవడానికి వెళ్ళిపోయారు. “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రం ఈ నెల ౧౪ విడుదల కానుంది ఈ చిత్రం భారీ విజయం సాదించాలని ఆశిద్దాం. ఈ సంభాషణను మిమ్మల్ని ఆకట్టుకుందని అనుకుంటున్నాము.

Click Here For Interview in English

సంబంధిత సమాచారం

తాజా వార్తలు